ధాన్యం కొనుగోళ్లపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ వినతి
- ధాన్యం కొనుగోళ్లపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ వినతి - September 21, 2026
- గణేష్ మండపాల వద్ద అన్నదానం - September 20, 2026
- పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి ..8 మంది అరెస్టు - September 20, 2026
ధాన్యం కొనుగోళ్లపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ వినతి
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 21 : మండలంలోని వివిధ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతిపత్రం అందజేసినట్లు ఆ పార్టీ మండల కార్యదర్శి పెంజర్ల సైదులు తెలిపారు. పీఏసీఎస్. ఐకేపీ, ఎన్డీసీఎంఎస్, హాకా ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల్లో అధిక తూకాలు, తప్పుడు రికార్డుల నమోదు. రవాణా పేరుతో రైతుల నుంచి అదనపు వసూళ్లు, హమాలీ చార్జీల పేరుతో అధిక మొత్తం వసూళ్లు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. కల్మెర, పందనపల్లి, దుగినవెల్లి, ఈదులూరు, నారెగూడెం, పరడ, మునుకుంట్ల, అయిటిపాముల, కురుమర్తి, పిట్టంపల్లి, బొల్లెపల్లి కేంద్రాల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి రైతుల నుంచి వసూలు చేసిన సొమ్మును రికవరీ చేయాలని కోరారు.
