గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి : ఐసీడీఎస్ సూపర్ వైజర్ సోమ పద్మావతి
- గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి : ఐసీడీఎస్ సూపర్ వైజర్ సోమ పద్మావతి - September 25, 2026
- వైద్యం కోసం వస్తే భయం వెంటాడుతోంది.. - September 24, 2026
- అంబటి వాగులో ప్రభుత్వ భూమిని పరిశీలించిన అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి - September 24, 2026
గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి :
ఐసీడీఎస్ సూపర్ వైజర్ సోమ పద్మావతి
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 19 :
కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పోషకాహార వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్ వైజర్ సోమ పద్మావతి మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా తల్లితో పాటు శిశువు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు, చిరుధాన్యాలు తదితర పోషకాహారాన్ని రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవాలని సూచించారు. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్ గంటెకంపు రామలింగమ్మ, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
