హమారా ప్రసాద్‌పై జనగామలో నిరసన.. దిష్టిబొమ్మ దహనం.

జనగామ, సెప్టెంబర్ 18: డా. బి.ఆర్. అంబేద్కర్‌పై హమారా ప్రసాద్ చేసినట్లు పేర్కొన్న వ్యాఖ్యలను నిరసిస్తూ జనగామలో కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జనగామ చౌరస్తాలో ర్యాలీ చేపట్టి, హమారా ప్రసాద్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి అనంతరం దహనం చేశారు.

ఈ సందర్భంగా సమితి జాతీయ అధ్యక్షులు డా. జేరిపోతుల పరశురామ్ మాట్లాడుతూ, అంబేద్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ హమారా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అంబేద్కర్ చరిత్ర, రాజ్యాంగ రచనపై ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాతీయ సలహాదారు మల్లిగారి రాజు, స్వేరో జిల్లా అధ్యక్షుడు ప్యాట రాజు, బక్క సునీల్, మచ్చ కుమార్, తాళ్లపల్లి ఎల్లేష్, రొడ్డ కృష్ణ, గండి చంద్రశేఖర్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

You may also like...