డిండి ఎత్తిపోతల పథకం అంశంపై సమీక్ష సమావేశం
- డిండి ఎత్తిపోతల పథకం అంశంపై సమీక్ష సమావేశం - August 27, 2026
- సురేఖపై అధిష్ఠానం కొరడా! - August 27, 2026
- ఆటో డ్రైవర్లకు గుడ్న్యూస్ - August 27, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 27: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులతో అత్యవసర సమీక్షా సమావేశం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించబడింది.ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని చారగొండ మండలం పరిధిలోని గోకారం గ్రామ రైతుల భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడటంతో పాటు,ఎర్రవల్లి గ్రామపంచాయతీ మరియు తాండ మొత్తం ప్రాజెక్టు కారణంగా తీవ్రంగా ప్రభావితమై,భూములు మరియు నివాస ప్రాంతాలను కోల్పోయే పరిస్థితి నెలకొన్న అంశాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,జూపల్లి కృష్ణారావుల దృష్టికి అత్యవసరంగా తీసుకువెళ్లారు.నల్గొండ ప్రాంతానికి సాగునీరు అందించే క్రమంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన గోకారం, ఎర్రవల్లి గ్రామపంచాయతీల ప్రజలు తమ విలువైన వ్యవసాయ భూములతో పాటు గ్రామాలు,నివాసాలను కూడా కోల్పోయే పరిస్థితి తలెత్తడం సమంజసం కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ప్రాజెక్టు తప్పని పరిస్థితి అయినచో ప్రజల జీవనోపాధి, వ్యవసాయ భూములు మరియు గ్రామాల ఉనికిని పరిరక్షించేందుకు, ప్రస్తుత సాధ్యమైన ప్రత్యామ్నాయ మార్గం ప్రాజెక్టు రూపకల్పన,ఎత్తు మరియు సామర్థ్యానికి సంబంధించి అవసరమైన సాంకేతిక మార్పులను పరిశీలించడం ద్వారా సాధ్యమైనంత వరకు భూసేకరణను తగ్గించి, రైతులు మరియు గ్రామ ప్రజలు తమ భూములు, నివాసాలను కోల్పోకుండా ప్రత్యామ్నాయ పరిష్కారాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.రైతుల ప్రయోజనాలకు, స్థానిక ప్రజల జీవనోపాధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ,సంబంధిత అధికారులు సాంకేతికంగా అన్ని సాధ్యాసాధ్యాలను పరిశీలించి, భూసేకరణ వల్ల కలిగే నష్టాన్ని పూర్తిస్థాయిలో నివారించేందుకు లేదా సాధ్యమైనంత మేర తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి , కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి,కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ విజయభాస్కర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
