పోలేపల్లి లో వనమహోత్సవ మొక్కలు పంపిణీ చేసిన సర్పంచ్
- మృతుడి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక సహాయం - August 10, 2026
- మోదీతో సీడబ్ల్యూజీ విజేతల భేటీ - August 9, 2026
- విద్యార్థులపై దాడిపై అమిత్ షా మౌనం ఎందుకు? - August 9, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 09: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం పోలేపల్లి గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సర్పంచ్ జంతుక వెంకటయ్య పాలకవర్గంతో కలిసి ఆదివారం ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటికి ఐదు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన సంరక్షణకు,పర్యావరణ పరిరక్షణకు,భూమి మీద జీవి మనుగడ కొనసాగాలంటే వృక్షాలే ప్రధాన ఆధారమని,ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని, మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.
