సమస్యలపై పోరాటమే లక్ష్యం: సర్వేష్
- ప్రజల్లోనే ఉండాలి.. పథకాలే పార్టీకి బలం: బొల్లారం వెంకట్రెడ్డి - August 4, 2026
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది - August 4, 2026
- యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాలే లక్ష్యం - August 4, 2026

జ్ఞాన తెలంగాణ, గండిపేట్ మండల ప్రతినిధి, ఆగస్టు 3:
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కిస్మత్పూర్ గ్రామం 122వ డివిజన్ పరిధిలోని శ్రీ బాలాజీ ఎంక్లేవ్ కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్యపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ సీనియర్ నాయకుడు నీరుడు సర్వేష్ ముదిరాజ్ వెంటనే స్పందించారు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు స్వయంగా కాలనీని సందర్శించి ప్రజలతో మాట్లాడారు.
సమస్య తీవ్రతను గుర్తించిన నీరుడు సర్వేష్ ముదిరాజ్ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, శ్రీ బాలాజీ ఎంక్లేవ్తో పాటు పరిసర కాలనీల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ సందర్భంగా నీరుడు సర్వేష్ ముదిరాజ్ మాట్లాడుతూ, 121, 122, 123 డివిజన్ల పరిధిలోని కిస్మత్పూర్, బండ్లగూడ జాగిర్, హైదర్ షాకోట్ ప్రాంత ప్రజలు ఎలాంటి సమస్య వచ్చినా తమను సంప్రదించాలని కోరారు. “ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తాం.. పోరాడుతాం.. పరిష్కరిస్తాం” అనే లక్ష్యంతో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొని మంచినీటి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కోరారు.
