విద్యార్థుల కేసుల ఎత్తివేతకు రాష్ట్రాలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
- సాయి నగర్లో భక్తిశ్రద్ధలతో గణనాథుడి పూజలు - September 19, 2026
- చౌడర్గూడలో TOSS ప్రవేశాల ప్రచారం - September 19, 2026
- హెచ్-1బీపై 1 లక్ష డాలర్ల ఫీజు కొనసాగింపు - September 19, 2026

న్యూఢిల్లీ, ఆగస్టు 4: నీట్ పేపర్ లీక్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అమాయక విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉందని స్పష్టం చేసింది. అయితే తీవ్రమైన నేర చరిత్ర ఉన్నవారికి ఈ మినహాయింపు వర్తించదని తేల్చిచెప్పింది.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ సందర్భంగా, విద్యార్థులపై అధిక బలాన్ని ప్రయోగించిన పోలీసులను సమర్థించకూడదని, అదే సమయంలో విద్యార్థుల ముసుగులో హింసకు పాల్పడిన వారిని వదిలిపెట్టరాదని వ్యాఖ్యానించింది.
కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అమాయక విద్యార్థులపై కేసులను ఉపసంహరించుకుంటామని కోర్టుకు తెలిపారు. సుమారు 2,700 మంది తీవ్రమైన నేరచరిత్ర కలిగిన వారిపై మాత్రం కేసులు కొనసాగుతాయని వెల్లడించారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 18కు వాయిదా వేసింది.
