మహాలింగాపురంలో ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శన
- గడ్డం వెంకటస్వామి ఆశయాలకు ఘన నివాళి - October 5, 2026
- మహాలక్ష్మికి పెరుగుతున్న ఆదరణ..3 నెలల్లో 97.20 లక్షల అదనపు ప్రయాణాలు - October 5, 2026
- ఎన్నికల వ్యవస్థపై కాంగ్రెస్ మూడు డిమాండ్లు - October 5, 2026

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో ముసాయిదా ఓటరు జాబితాను బూత్ స్థాయి అధికారి (BLO) ప్రదర్శించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అనంతరం రూపొందించిన ముసాయిదా జాబితాను గ్రామ ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు.
గ్రామంలోని ప్రతి ఓటరు ముసాయిదా జాబితాలో తమ పేరు, చిరునామా, వయస్సు, ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. జాబితాలో ఏవైనా తప్పులు, అభ్యంతరాలు లేదా మార్పులు అవసరమైతే నిర్ణీత గడువులో సంబంధిత అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేందుకు ముందుగానే తమ వివరాలను పరిశీలించుకోవాలని కోరారు. మహాలింగాపురం గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
