పట్టభద్రులంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలి..జంగిలి యాదగిరి

వెల్దండ:మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హత కలిగిన పట్టభద్రులందరూ బాధ్యతగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని వెల్దండ మండల బీఆర్‌ఎస్‌ యువజన విభాగం అధ్యక్షుడు జంగిలి యాదగిరి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం వెల్దండ తహసీల్దార్‌ కార్తీక్‌ కుమార్‌కు ఓటు నమోదు దరఖాస్తు ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో విద్యావంతులైన యువత, ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకొని…

పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి సుంకిరెడ్డి రూ.6.80 లక్షల సహకారం

తలకొండపల్లి:రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గౌరిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ నిర్మాణం, అభివృద్ధికి రూ.6.80 లక్షల సహకారం అందించిన రాఘవేందర్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికి…

ఎల్ఐసిలో 1996 బ్యాచ్ ఓపెన్ మార్కెట్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలి

ఎల్ఐసిలో 1996 బ్యాచ్ ఓపెన్ మార్కెట్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్ అక్టోబర్ 14 : ‌ఎల్ఐసిలో 1996 నోటిఫికేషన్ ద్వారా నియామకాలు పొందిన ఓపెన్ మార్కెట్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఐసీఈయూ సికింద్రాబాద్ డివిజన్ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం, 14 అక్టోబర్ 2026 న మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లగొండ బ్రాంచ్-1,2ల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు….

డ్రగ్స్ కేసులో ఇద్దరి అరెస్ట్..170 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్ స్వాధీనం

ఆమనగల్లు:డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు డీసీపీ కే. నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎస్‌ఓటీ మహేశ్వరం జోన్ బృందం, కడ్తాల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 170 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్, రెండు ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన బబుల్ ఉమ్మర్ అబ్దుల్ అజీజ్ (34), హంసత్ ఫాసన్ (32)లను అరెస్టు చేశారు.నిందితులు…

ఆలయ నిర్మాణానికి భక్తుల విరాళాల వెల్లువ..రూ.3.52 లక్షలకు పైగా విరాళాలు

వెల్దండ అక్టోబర్ 14: వెల్దండ మండలంలోని చెరుకూరు గ్రామంలో నిర్మిస్తున్న శ్రీశ్రీ శివాలయం, ఆంజనేయస్వామి దేవాలయాల నిర్మాణానికి భక్తులు విరాళాలు అందిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు.ఆలయ నిర్మాణానికి పలువురు దాతలు ఉదారంగా విరాళాలు అందించారు.మండే గుత్తల విజయ్ కుమార్, భద్రప్ప, శివలింగం రూ.1,00,116 విరాళంగా అందించగా, యెడ్ల శృతి (మున్నీ), ఆమె భర్త యెడ్ల ప్రభాకర్ రెడ్డి రూ.50 వేలు సమర్పించారు. అదేవిధంగా కొండారెడ్డి పల్లికి చెందిన కోసిరెడ్డి విజయలక్ష్మి రూ.51,116, బుడ్డోన్‌పల్లికి చెందిన ముత్యాల అరుణమ్మ,…

భిక్నూర్ గ్రామంలో నూతన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు…

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం భిక్నూర్ గ్రామంలో *రూ.10 లక్షల వ్యయంతో* నిర్మించిన మహిళా స్వయం సహాయక సంఘం (SHG) భవనాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ప్రారంభించారు. గతంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తమకు ప్రత్యేక భవనం అవసరమని ఎమ్మెల్యే మదన్ మోహన్ గారిని కలిసి విజ్ఞప్తి చేశారు. మహిళా సంఘాల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు నూతన భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ…

కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ జెండా పండుగ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు పాల్గొని కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, ప్రజా సంక్షేమ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్థులు…

పిట్లం–బాన్సువాడ మార్గంలో బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు!

పిట్లం నుంచి బాన్సువాడకు వెళ్లే ఆర్టీసీ బస్సులు సమయానికి నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొనడంతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. నిర్ణీత సమయానికి బస్సులు అందుబాటులో లేకపోవడంతో తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో జాప్యం జరుగుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా అత్యవసర పనులపై వెళ్లేవారు, రోజువారీ ప్రయాణాలు చేసేవారు బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు. పిట్లం–బాన్సువాడ మార్గంలో బస్సుల రాకపోకలపై…

మైలార్‌దేవ్‌పల్లిలో రూ. 1.78 కోట్లతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

నూతనంగా చేపట్టనున్న సీసీ (CC) రోడ్ల నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే శ్రీ టి. ప్రకాష్ గౌడ్ మంగళవారం లాంఛనంగా శంకుస్థాపన చేసి, పనులను ప్రారంభించారు.

యువత ఆర్థిక ఎదుగుదలే దేశ అభివృద్ధికి తొలిమెట్టు.. టాస్క్ సి బాబు శంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

ఆమనగల్లు అక్టోబర్ 13 :యువత ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం,దేశం అభివృద్ధి చెందుతాయని టాస్క్ సీఓఓ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.మంగళవారం ఆమనగల్ పట్టణ కేంద్రంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 25వ జాబ్ డ్రైవ్‌కు ఆయన హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కంపెనీల ప్రతినిధులను నేరుగా యువత వద్దకు తీసుకొచ్చి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దూర…