శంకర్‌పల్లిలో ‘మా విలేజ్ రెస్టారెంట్’ ప్రారంభం
- సాయి నగర్లో భక్తిశ్రద్ధలతో గణనాథుడి పూజలు - September 19, 2026
- చౌడర్‌గూడలో TOSS ప్రవేశాల ప్రచారం - September 19, 2026
- హెచ్-1బీపై 1 లక్ష డాలర్ల ఫీజు కొనసాగింపు - September 19, 2026

శంకర్పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన “మా విలేజ్ రెస్టారెంట్” ను మాజీ హోంశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, స్థానికంగా ఉపాధి అవకాశాలను కల్పించే వ్యాపార సంస్థలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నాణ్యమైన ఆహారంతో పాటు వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రజల ఆదరణ పొందాలని రెస్టారెంట్ యాజమాన్యానికి సూచించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అతిథులను రెస్టారెంట్ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో నిర్వహించగా, స్థానికులు రెస్టారెంట్ ప్రారంభాన్ని స్వాగతిస్తూ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.




