వెల్దండలో వీబీజీ రాంజీ ఉద్యోగుల నిరసన.!
- సాయి నగర్లో భక్తిశ్రద్ధలతో గణనాథుడి పూజలు - September 19, 2026
- చౌడర్గూడలో TOSS ప్రవేశాల ప్రచారం - September 19, 2026
- హెచ్-1బీపై 1 లక్ష డాలర్ల ఫీజు కొనసాగింపు - September 19, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,ఆగస్టు 04:

గత ఉపాధి హామీ పథకం ప్రస్తుత (విబిజి రాంజీ) లో 20 గత సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎఫ్.టి ఈ(ఫిక్సిడ్ టెన్యూర్ ఎంప్లాయ్)లకు ఇస్తామని పేస్కేల్ ను కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది.దానికి అనుగుణంగానే రెండు సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 2024 నాడు ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం పొంది ప్రకటనకు ముందు నిలిచిపోయింది.అది ఇప్పటివరకు అమలు కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం విబిజి రాంజీ ఉద్యోగులకు ప్రకటించిన పే స్కేల్ ను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఇతర సమస్యలను అమలు చేయాలని కోరుతూ వెల్దండ మండలంలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన చేయడం జరిగింది. బుధవారం ఆగస్టు 05 నుండి విబిజిరాంజీ పథకంలో పే స్కేల్ అమలయ్యే వరకు ఎలాంటి పనులు జరగకుండా షట్ డౌన్ కార్యక్రమం ఉదృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏపీవో ఈశ్వర్ జి, ఈసీ దేవేందర్ గౌడ్ ,ఏ.సి.ఓ లు కే రాము, ఎస్ హుస్సేన్, టెక్నికల్ అసిస్టెంట్లు లింగస్వామి కృష్ణవేణి, శివలీల, సత్యనారాయణ, రేణమ్మ తదితరులు పాల్గొన్నారు.
