మృతుడి కుటుంబానికి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద రూ.20 వేల సాయం
- కల్వకుర్తి యాదవ సంఘం అధ్యక్షుడిగా జక్కుల చిన్న జంగయ్య యాదవ్! - November 6, 2026
- కొట్ర తండా కూడలిలో పోలీసుల ముమ్మర వాహన తనిఖీలు - November 6, 2026
- ఎస్సీ సంక్షేమ పథకాల సాధనకు ర్యాలీ.. పోలీసులకు వినతి - November 6, 2026

వెల్దండ నవంబర్ 06: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్ఎఫ్బీఎస్) కింద తర్నికంటి లింగమయ్య కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.20 వేల ఆర్థిక సాయం వారి బ్యాంకు ఖాతాలో జమైంది. ఈ సందర్భంగా పోతేపల్లి గ్రామ సర్పంచ్,తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి తగుళ్ల కొండలు యాదవ్ మాట్లాడారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు,యువ నాయకులు వావిళ్ళ యాదగిరి, ఎగిరిశెట్టి శివ,మార్కండేయుడు, బాలు యాదవ్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
