రాజేంద్రనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ
- 122 డివిజన్ బండ్లగూడలో గణనాథుడిని దర్శించుకున్న బీఆర్ఎస్ ఇన్చార్జ్ కార్తీక్ రెడ్డి. - September 15, 2026
- రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా గంగని హరికృష్ణ నియామకం - September 15, 2026
- రాజేంద్రనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ - September 15, 2026

హైదరాబాద్, సెప్టెంబర్ 15: స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిజిటల్ (స్మార్ట్) రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, లబ్ధిదారులకు నూతన స్మార్ట్ కార్డులను తన చేతుల మీదుగా అందజేశారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సుమారు 1,23,000 పాత రేషన్ కార్డులను ప్రభుత్వం స్మార్ట్ కార్డులుగా మార్చి అందిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన నూతన దరఖాస్తు అవకాశంతో, నియోజకవర్గంలో కొత్తగా సుమారు 60 వేల మందికి రేషన్ కార్డుల్లో సభ్యులుగా అవకాశం లభించింది.
అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు, రేషన్ సరుకులు మరింత పారదర్శకంగా అందించడమే ఈ స్మార్ట్ కార్డుల ముఖ్య ఉద్దేశ్యమని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ తహసిల్దార్ రాములు, పౌరసరఫరాల శాఖ అధికారి పుల్లయ్య, గండిపేట్, శంషాబాద్ రెవెన్యూ అధికారులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
