ఎమ్మెల్యే మదన్ మోహన్ చొరవతో అభివృద్ధి బాటలో ఒంటర్‌పల్లి గ్రామం…

రూ.30 లక్షలతో గ్రామ పంచాయతీ, మహిళా సంఘ భవనాల నిర్మాణానికి భూమిపూజ – ప్రభుత్వ పాఠశాలకు నాబార్డ్ నిధుల ద్వారా రూ.27.50 లక్షలు మంజూరు…
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఒంటర్‌పల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు పర్యటించి, రూ.30 లక్షల నిధులతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవనం (రూ.20 లక్షలు), మహిళా సంఘ భవనం (రూ.10 లక్షలు) నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఒంటర్‌పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం నాబార్డ్ నిధుల ద్వారా రూ.27.50 లక్షలు మంజూరు చేయించడంపై హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో విద్యా సదుపాయాల అభివృద్ధికి నిధులు కేటాయించడం పట్ల ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీ భవనం ద్వారా పరిపాలనా కార్యకలాపాలు మరింత సులభతరం అవుతాయని, మహిళా సంఘ భవనం ద్వారా మహిళలు సమావేశాలు నిర్వహించుకోవడానికి, సంఘ కార్యకలాపాలు కొనసాగించుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి నాబార్డ్ నిధుల ద్వారా రూ.27.50 లక్షలు మంజూరు చేయించడం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధితో పాటు విద్య, మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ సర్పంచ్, గ్రామ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ మండల కాంగ్రెస్ నాయకులు, పీఏసీఎస్ చైర్మన్, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Dubbaka Srinivas

My name is DUBBAKA SRINIVAS, Education:(B.A), GRADUATED, I have multiple skills but I'm interested journalism My was facing the more than problems in society but I stand with GENUINE & TRUE peoples and society I will try to Justies, I will show the truth to society.

You may also like...