ఫాతిమానగర్ బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలి: బీజేపీ డిమండ్.
- సాయి నగర్లో భక్తిశ్రద్ధలతో గణనాథుడి పూజలు - September 19, 2026
- చౌడర్గూడలో TOSS ప్రవేశాల ప్రచారం - September 19, 2026
- హెచ్-1బీపై 1 లక్ష డాలర్ల ఫీజు కొనసాగింపు - September 19, 2026

హానుమకొండ:ఫాతిమానగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (RoB) నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఫాతిమానగర్ బ్రిడ్జిపై భారీ ధర్నా నిర్వహించారు.ఈ నిరసన కార్యక్రమములో బీజేపీ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు నర్మెట్ట శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. బ్రిడ్జి నిర్మాణం ఏళ్ల తరబడి సాగుతూ నత్తనడకన సాగడం వల్ల వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. అధికారులు, పాలకులు నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే పనులు పూర్తి చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
