మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన – డీసీసి ఉపాధ్యక్షులు యెన్నం భూపతి రెడ్డి
- ప్రజల్లోనే ఉండాలి.. పథకాలే పార్టీకి బలం: బొల్లారం వెంకట్రెడ్డి - August 4, 2026
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది - August 4, 2026
- యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాలే లక్ష్యం - August 4, 2026

. సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 04
వెల్దండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు మారేపల్లి శ్రీను తండ్రి మారేపల్లి నిరంజన్ మరణించిన విషయం తెలుసుకున్న వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు యెన్నం భూపతి రెడ్డి లు మంగళవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి పార్థీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను అధైర్య పడకుండా, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ వావిళ్ళ ఉమా సంజీవ్ యాదవ్, మత్స్యకార సొసైటీ జిల్లా డైరెక్టర్ క్యాసరపు వెంకటయ్య ,
వార్డు సభ్యులు పాలాది మల్లీశ్వరి రంగనాథం, గుద్దటి కిష్టల్, గోసుల కొండల్,మసిగుండ్ల వెంకటేష్, సీనియర్ నాయకులు ఎండి అమీద్,కొయ్యల పుల్లయ్య, తుంగ శ్రీను, మట్ట భరత్,జంగిలి ఆనందు ,గోరేటి భరత్, మట్ట విష్ణు,పుట్ట యాదయ్య, అన్నెపు వెంకటయ్య,రేవల్లి బాలరాజు , మట్ట మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
