మున్సిపల్ పాలనపై సామర్థ్య శిక్షణ
పట్టణ పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, పారిశుద్ధ్య వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) అధికారులకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) ఆధ్వర్యంలో ఒకరోజు సామర్థ్య పెంపు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్లోని ఏఎస్సీఐ కాలేజ్ పార్క్ క్యాంపస్లో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలన, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య ప్రమాణాలు తదితర అంశాలపై అధికారులకు నిపుణులు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఏఎస్సీఐ రిజిస్ట్రార్ డాక్టర్ ఓ.పి. సింగ్,…
