భూముల విక్రయంపై నిరసనగా భారీ ధర్నా
ప్రజా అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూములను విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.ప్రభుత్వం వెంటనే భూముల వేలాన్ని నిలిపివేయాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంబిపూర్ రాజు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు…
