జహీరాబాద్‌లో లారీ బీభత్సం.. కారును ఈడ్చుకెళ్లిన డ్రైవర్
- ఛత్తీస్‌గఢ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
- November 17, 2026 - తల్లి గర్భంలోనే శిశువుకు శస్త్రచికిత్స.. - November 16, 2026
- చిన్న, మధ్యతరహా పత్రికల సమస్యలపై మేధోమథనం - November 16, 2026

జ్ఞాన తెలంగాణ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఓ కారును బలంగా ఢీకొట్టిన లారీని ఆపకుండా అలాగే కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు నాలుగు కార్లలో లారీని వెంబడించారు. పాస్తాపూర్ ఫ్లైఓవర్ వద్ద లారీని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారిని సైతం ఢీకొట్టి తప్పించుకునేందుకు డ్రైవర్ యత్నించాడు. చివరకు పోలీసులు రంగంలోకి దిగి లారీని అడ్డుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని జహీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
