కామారెడ్డి జిల్లాలో 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలు
కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్-1861 అమలు చేస్తున్నట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
