రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి.. గాజులగూడెంలో విషాదఛాయలు
- రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి.. గాజులగూడెంలో విషాదఛాయలు - November 3, 2026
- మేడిగడ్డ నుంచి కేటీఆర్ బస్సు యాత్ర! - November 2, 2026
- తెలంగాణలో ఖేలో ఇండియా క్రీడలకు భారీ ఏర్పాట్లు - November 2, 2026

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి వెబ్ డెస్క్ :
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం గాజులగూడెం గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు ఎల్లకొండ నర్సింలు, ఆయన భార్య ఎల్లకొండ మౌనిక కంది సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. దంపతుల మరణవార్త తెలియగానే గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈరోజు వారి స్వగ్రామమైన గాజులగూడెంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పలువురు రాజకీయ నాయకులు, గ్రామస్థులు వారి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
