డేటింగ్ యాప్‌తో వల.. మత్తుమందు ఇచ్చి దోపిడీలు

మల్కాజిగిరి: గ్రైండర్ డేటింగ్ యాప్‌ ద్వారా పరిచయాలు పెంచుకుని, బాధితులకు మత్తు పదార్థాలు కలిపిన బీరు ఇచ్చి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు దోచుకుంటున్న ఐదుగురు నిందితులను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా బాధితుల వివరాలు సేకరించి, ఇళ్లకు వెళ్లి నేరాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మల్కాజిగిరి, సైబరాబాద్, హైదరాబాద్, విశాఖపట్నం పోలీస్ పరిధుల్లో మొత్తం 14 కేసులతో వీరికి సంబంధాలున్నట్లు గుర్తించారు. ప్రజలు అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని, ఆన్‌లైన్ పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సహాయం కోసం 112కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు.

You may also like...