పాత్రికేయులకు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు: సర్పంచ్ ప్రసాద్ గౌడ్
- పోలేపల్లి సమస్యలను పరిష్కరించండి సారు – సర్పంచ్ వెంకటయ్య.! - November 16, 2026
- ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా.. సర్పంచ్ ప్రసాద్ గౌడ్ హర్షం! - November 16, 2026
- అర్హులకు ఆసరా పింఛన్ల పంపిణీ – సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ - November 16, 2026

కల్వకుర్తి నవంబర్ 16: జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పాత్రికేయులందరికీ బొల్లంపల్లి సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్థంభంగా పత్రికా రంగం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజల గొంతుకగా నిలుస్తున్న పాత్రికేయుల సేవలు అభినందనీయమన్నారు. నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువస్తూ సమాజ అభివృద్ధికి పాత్రికేయులు మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.
