సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మేడ్చల్ డివిజన్ దస్తావేజుల కార్యాలయాన్ని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న రిజిస్ట్రేషన్ సేవలను పరిశీలించారు. ప్రజలకు సమీపంలోనే రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. కొత్త కార్యాలయం ద్వారా ప్రజలకు రిజిస్ట్రేషన్ సంబంధిత పనులు మరింత సులభతరం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.