రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all)
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో పాఠశాల నిర్మాణానికి 2.39 ఎకరాల స్థలం కేటాయించడంపై సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం కేపీహెచ్‌బీ రమ్య గ్రౌండ్లో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలో పాఠశాల నిర్మాణం చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో గాలి బాలాజీ, రాజేష్, శంకర్ గౌడ్, కొప్పిశెట్టి దినేష్ కుమార్, రంగమోహన్, బాబ్జి కుమార్, నితీష్, సంధ్య వాణి, సుజాత, సరోజ, అపర్ణ, జయలక్ష్మి, రాజేశ్వరి, బచ్చుమల్లి, రజిత, గోపాల్ చౌదరి, కల్పన, రజిని తదితరులు పాల్గొన్నారు.
