కల్వకుర్తిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై ప్రతిపక్ష సర్పంచ్‌ల అభ్యంతరం.!

1001365400.jpg

కల్వకుర్తి నవంబర్15:ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిర్వహించే చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా జరగాలని ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు సర్పంచ్‌లు అభిప్రాయపడ్డారు.కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరైన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలకు చెందిన సర్పంచ్‌లను ఆహ్వానించకపోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌లు ఏ పార్టీకి చెందిన వారైనా గ్రామ అభివృద్ధి,ప్రజా సమస్యలు,సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.అధికార పార్టీ, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతి ప్రజాప్రతినిధికి ప్రభుత్వ కార్యక్రమాల్లో సమాన గౌరవం, ప్రాధాన్యత కల్పించాలని కోరారు.సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని సూచించారు.రాజకీయ విభేదాలు ఎన్నికలకే పరిమితం కావాలని,ప్రజాప్రతినిధుల మధ్య పరస్పర గౌరవం,మర్యాద కొనసాగాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతి సర్పంచ్‌కు తగిన గుర్తింపు ఇవ్వాలని వారు కోరారు.

You may also like...