పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే మాణిక్ రావు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్

జహీరాబాద్: నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వివాహ వేడుకల్లో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ముంగి ఎస్ఆర్‌కే గార్డెన్స్, ఝరాసంగంలోని లింగాయత్ ఫంక్షన్ హాల్, ఎస్వీ పస్తాపూర్,జహిరాబాద్ పీవీఆర్ గార్డెన్స్, ఉత్తమ్ గార్డెన్స్, మొగుడంపల్లిలోని అజాన్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన వివాహ వేడుకలకు వారు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండప్ప, మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, జహీరాబాద్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంగం మండల అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కోహీర్ మండల అధ్యక్షులు నర్సింలు, న్యాల్కల్ మండల అధ్యక్షులు రవీందర్,ఝరాసంగంకేతకి మాజీ ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్.ఝరాసంగం సర్పంచ్ బాలరాజ్. ఝరాసంగం మాజీ సర్పంచ్. జగదీష్. తుమ్మలపల్లి సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...