టీఆర్ఎస్‌లో చేరిన శెట్పల్లి సంగారెడ్డి యువ నాయకులు
- టీఆర్ఎస్‌లో చేరిన శెట్పల్లి సంగారెడ్డి యువ నాయకులు - November 14, 2026
- కులవివక్షకు తావులేకుండా అందరికీ ఆలయ ప్రవేశ హక్కు కల్పించాలి - November 12, 2026
- నాబార్డ్ నిధులతో బ్రాహ్మణపల్లి పాఠశాల అభివృద్ధికి బాటలు.. ఎమ్మెల్యే మదన్ మోహన్ చిత్రపటానికి పాలాభిషేకం - November 12, 2026
ఎల్లారెడ్డి నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ ఇంచార్జి ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో లింగంపేట్ మండలం శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన యువ నాయకులు మున్నూరి సాయిబాబా, పెద్ద విఠల్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంపత్ గౌడ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోకల సాయిరాం, జిల్లా యువజన అధ్యక్షుడు జైల్ సింగ్, మండల మహిళా అధ్యక్షురాలు సావిత్రి, మండల కార్యదర్శి మహేందర్, మండల సీనియర్ నాయకుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
