జనగామ మండల ఎస్సీ సెల్ నూతన కమిటీ ఏర్పాటు

WhatsApp Image 2026-11-14 at 19.19.53.jpeg

జనగామ: జనగామ మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు యాసారపు పరశురాములు ఆధ్వర్యంలో రూపొందించిన కమిటీ జాబితాను జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వేముల మల్లేష్ మహారాజ్‌కు అందజేశారు.ఈ సందర్భంగా వేముల మల్లేష్ మహారాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల్లో ఎస్సీ సెల్ కీలకమైందని, జిల్లాలోని ప్రతి గ్రామంలో కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారం, హక్కులు, సంక్షేమం కోసం సభ్యులు నిరంతరం కృషి చేయాలన్నారు.మండల అధ్యక్షుడు యాసారపు పరశురాములు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడి సూచనల మేరకు ప్రతి గ్రామంలో ఎస్సీ సెల్‌ను విస్తరించి, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.

You may also like...