రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహేష్ కుటుంబానికి మాజీ సర్పంచ్ ఆర్థిక సహాయం

త్రిపురారం:- త్రిపురారం మండల కేంద్రంలోని ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన పర్వతం అంజయ్య చిన్న కుమారుడు పర్వతం మహేష్ (24) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

విషయం తెలుసుకున్న త్రిపురారం మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో 1వ వార్డు సభ్యులు చింతకాయల యాదయ్య, 2వ వార్డు సభ్యులు రావుల శ్రీను, 10వ వార్డు సభ్యులు నల్లగంటి శివన్‌తో పాటు అవిరెండ్ల దానియేలు, ఎరుకల రామకృష్ణ, పర్రె కృష్ణ, ప్రశాంత్, సైదులు, గణేష్, తాటికొండ తిరుపయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like...