రిపోర్టర్, ములుగు | 8074260687
Latest posts by Ananth thippanapalli
(see all) ములుగు: ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) ములుగు జిల్లా నూతన కమిటీని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ అధ్యక్షుడు ఉపేందర్ మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం తుడుం దెబ్బ కార్యకర్తలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
నూతన జిల్లా అధ్యక్షుడిగా సిద్ధబోయిన సర్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా వట్టం సురేష్‌తో పాటు ఇతర కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివాసీల సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు నూతన కమిటీ కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.