ఓం నగర్ కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
- ఓం నగర్ కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం - November 12, 2026
- దోహా ఐటీయూ (ITU) సదస్సులో భారత డిజిటల్ విప్లవాన్ని చాటిచెప్పిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ - November 12, 2026
- కోకాపేటలో ‘వజ్ర అటెలియర్’ గ్రాండ్ లాంచ్. - November 12, 2026

కిస్మత్పూర్: రాజేంద్రనగర్ నియోజకవర్గం, కిస్మత్పూర్ 122వ డివిజన్లోని ఓం నగర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సహకారంతో, మాజీ కార్పొరేటర్ గోకరి శ్రీలత సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
అనంతరం నాయకులు గోకరి సురేష్ గౌడ్, ఓం నగర్ కాలనీ ప్రెసిడెంట్ శ్యాములు గౌడ్ మరియు కాలనీవాసులతో కలిసి జరుగుతున్న సీసీ రోడ్డు పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వారు కాంట్రాక్టర్లకు సూచించారు. తమ కాలనీలో రోడ్డు సమస్యను పరిష్కరించినందుకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు మరియు మాజీ కార్పొరేటర్ దంపతులకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.
