రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all)
- మెదక్ నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మరో కీలక ముందడుగు పడిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో కొత్తగా రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు వెల్లడించారు.
మెదక్, నిజాంపేట మండలాల్లో మండల రెవెన్యూ కార్యాలయాల (ఎంఆర్ఓ కార్యాలయాలు) ఏర్పాటుకు టెండర్లు పూర్తయ్యాయని, అదేవిధంగా రామాయంపేట, మెదక్ పట్టణాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటుకు కూడా టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు పేర్కొన్నారు.ఈ కార్యాలయాలను త్వరితగతిన ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యాలయాలు అందుబాటులోకి వస్తే రెవెన్యూ సంబంధిత పనులు, భూ రికార్డులు, భూముల రిజిస్ట్రేషన్ వంటి సేవల కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని అన్నారు.ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా, వేగంగా అందించడంతో పాటు పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మెదక్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు వెల్లడించారు.
