సబ్ రిజిస్టార్ కార్యాలయాల టెండర్లు పూర్తి
మెదక్ నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మరో కీలక ముందడుగు పడిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో కొత్తగా రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు వెల్లడించారు.మెదక్, నిజాంపేట మండలాల్లో మండల రెవెన్యూ కార్యాలయాల (ఎంఆర్ఓ కార్యాలయాలు) ఏర్పాటుకు టెండర్లు పూర్తయ్యాయని, అదేవిధంగా రామాయంపేట, మెదక్ పట్టణాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటుకు కూడా టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు…
