విలువలతో కూడిన విద్యకు చిరునామా అధ్యాపక్ కళాశాల హైదరాబాద్:
- విలువలతో కూడిన విద్యకు చిరునామా అధ్యాపక్ కళాశాల హైదరాబాద్: - November 11, 2026
- చిన్న వయసులోనే ‘అచల తత్వ’ పీఠాధిపతిగా ప్రభాకర్ రెడ్డి: - October 29, 2026
- శంకర్పల్లి మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎం.డి. నసీరుద్దీన్ నియామకం - October 27, 2026
విలువలతో కూడిన విద్యకు చిరునామా అధ్యాపక్ కళాశాల
పటాన్చెరు ‘నందిగామ’లో కార్పొరేట్ సదుపాయాలతో ఆదర్శ విద్యాలయం!విలువలతో కూడిన జ్ఞానం… అనుభవజ్ఞులైన అధ్యాపకులతోనే సాధ్యం!” అనే ఉన్నతమైన ఆశయంతో పటాన్చెరు సమీపంలోని నందిగామలో ఓ ప్రత్యేకమైన విద్యాలయం అందుబాటులోకి వచ్చింది. బోధనానుభవమే పెట్టుబడిగా, అధ్యాపకులే స్వయంగా యాజమాన్యంగా మారి ఈ విద్యాసంస్థను స్థాపించడం విశేషం. బోధనపై పూర్తి పట్టున్న ఉపాధ్యాయులే స్వయంగా పర్యవేక్షించడంతో ఇక్కడ విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన నైపుణ్య ఆధారిత విద్య లభిస్తోంది.
హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో, ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు, స్వచ్ఛమైన వాతావరణం నడుమ దాదాపు 5 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను తీర్చిదిద్దారు. విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి అవసరమైన అన్ని ఆధునిక వసతులను ఇక్కడ సమకూర్చారు.

