నందివాడ, చిట్యాల, ఎర్రపహాడ్ గ్రామాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశాలు – యువ మోర్చా కమిటీల నియామకం
- నందివాడ, చిట్యాల, ఎర్రపహాడ్ గ్రామాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశాలు – యువ మోర్చా కమిటీల నియామకం - November 10, 2026
- ఘనంగా అంబేద్కర్ యువజన సంఘం 50వ స్వర్ణోత్సవ వేడుకల కరపత్రాల ఆవిష్కరణ - November 10, 2026
- నాయబ్ తహసీల్దార్ శృతిని సన్మానించిన అంబేద్కర్ సంఘం నాయకులు - November 10, 2026
తాడ్వాయి మండలంలోని నందివాడ, చిట్యాల, ఎర్రపహాడ్ గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా బీజేపీ తాడ్వాయి మండల అధ్యక్షులు వెల్మ సంతోష్ రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు పాటిమిది గంగారెడ్డి గారు, BJYM తాడ్వాయి మండల అధ్యక్షులు రెడ్డిగారి తిరుపతి రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా నూతనంగా BJYM తాడ్వాయి మండల అధ్యక్షులుగా ఎన్నికైన రెడ్డిగారి తిరుపతి రెడ్డి గారు వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ యువతతో సమావేశమయ్యారు. యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ఆయా గ్రామాల్లో యువ మోర్చా కమిటీల నియామకాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో స్థానిక బీజేపీ నాయకులు, యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
