కష్టకాలంలో కుటుంబానికి అండగా దైద రవీందర్ మృతుడి వెంకన్న కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేత

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 10 : మండలంలోని బొల్లెపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తాటి వెంకన్న మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పార్టీ నాయకులతో కలిసి వెంకన్న మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5వేల ఆర్థిక సాయం అందజేసి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి, తండ్రికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించిన ఆడబిడ్డను చూసి దైద రవీందర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ కుటుంబం పడుతున్న బాధను చూసి చలించిపోయారు. ఈ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున, వ్యక్తిగతంగా కూడా కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కుటుంబానికి కలిగిన నష్టం తీరనిదని, వారికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ నాయకులు గార్లపాటి రవీందర్ రెడ్డి, బొల్లెపల్లి సర్పంచ్ వల్లపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ జంజిరాల వెంకన్న, మాజీ ఎంపీటీసీ శీను, రవీందర్ రెడ్డి, వార్డు సభ్యుడు ముసం యాదగిరి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like...