రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన రాష్ట్ర కమిటీ, 22 జిల్లాల అధ్యక్షుల ప్రకటన
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ నూతన రాష్ట్ర కమిటీతో పాటు 22 జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తూ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ ప్రకటన విడుదల చేశారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి అల్కా లంబా ఆమోదంతో ఈ నూతన కమిటీని ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళా కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయడం, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని విస్తరించడం, మహిళా నాయకత్వానికి ప్రాధాన్యత కల్పించడం లక్ష్యంగా నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నూతన రాష్ట్ర కార్యవర్గంలో 11 మంది ఉపాధ్యక్షులకు, 10 మంది ప్రధాన కార్యదర్శులకు, 5 మంది కార్యదర్శులకు స్థానం కల్పించారు. వీరితో పాటు రాష్ట్రంలోని 22 జిల్లాలకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులను నియమించారు. పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంతో పాటు మహిళా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ సంస్థాగతంగా బలోపేతం చేసే బాధ్యతలను నూతనంగా నియమితులైన నాయకులకు అప్పగించారు.
మహిళల సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం, మహిళలకు రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, మహిళా సాధికారత కోసం కృషి చేయడం వంటి అంశాలపై నూతన కమిటీ ప్రధానంగా దృష్టి సారించనుంది.
నూతన రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షుల నియామకాలతో తెలంగాణలో మహిళా కాంగ్రెస్ కార్యకలాపాలకు మరింత ఊపునిచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న నాయకులకు పలువురు కాంగ్రెస్ నేతలు, మహిళా కార్యకర్తలు అభినందనలు తెలియజేస్తున్నారు.
