కాంగ్రెస్ సీనియర్ నాయకున్నీ పరామర్శించిన బండి రమేష్

అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులకు బండి రమేష్ పరామర్శ

కూకట్‌పల్లి: అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం కోలుకుంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ సోమవారం పరామర్శించారు. ఇటీవల గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడిన పార్టీ సీనియర్ నాయకులు పొడుగు అప్పారావు, సాయిబాబా చౌదరి చికిత్స పొందిన అనంతరం తమ స్వగృహాలకు చేరుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న బండి రమేష్ వారి నివాసాలకు వెళ్లి ఇరువురు నాయకులను, వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెబుతూ, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి కష్టసుఖాల్లో పార్టీ శ్రేణులు భాగస్వాములవుతాయని బండి రమేష్ పేర్కొన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్ నాయకుల ఆరోగ్యం తమకు ముఖ్యమని తెలిపారు. ఇరువురు నాయకులు త్వరగా కోలుకుని తిరిగి పార్టీ కార్యక్రమాల్లో గతంలో మాదిరిగా ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావు, కొప్పిశెట్టి దినేష్, అరవింద్ రెడ్డి, శ్రీనివాస్ బాబు, నాగార్జున, రాజేష్, శంకర్ గౌడ్, చావా శ్రీనివాస్, ప్రవీణ్, శివ చౌదరి, రామారావు, సురేష్, రవి, బచ్చుమల్లి, బాబ్జీ, మణిగౌడ్, నవాజ్, సంధ్య, రజిని తదితరులు పాల్గొన్నారు.

You may also like...