రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) కీసర పోలీస్ స్టేషన్లో మరో అవినీతి కలకలం.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్ఐ అరెస్ట్!
ఒకే పోలీస్ స్టేషన్లో వరుసగా లంచం కేసులు.. మారని అవినీతి తీరు
కీసర: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ మరోసారి అవినీతి ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్ఐ శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. పోలీస్ శాఖలో మరోసారి లంచం వ్యవహారం వెలుగులోకి రావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.వివరాల్లోకి వెళ్తే.. ఒక కేసుకు సంబంధించి చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ఎస్ఐ శ్రీనివాస్ రూ.2 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్నారు. నాగారం పరిధిలోని శిల్పానగర్‌లో లంచం సొమ్ము తీసుకుంటున్న సమయంలో ఎస్ఐను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలోనూ లంచం వ్యవహారాలు వెలుగులోకి రావడం, తాజాగా మరో అధికారి ఏసీబీకి చిక్కినట్లు వార్తలు రావడం పోలీస్ శాఖలో అవినీతి నియంత్రణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రజలకు న్యాయం అందించాల్సిన బాధ్యత కలిగిన వ్యవస్థలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారుల , తదుపరి చర్యలపై స్పష్టత రావాల్సి ఉంది.
