రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడి.. ఇంట్లో చోరీ
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడి ఆర్థిక అవసరాల కోసం ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్‌లోని శిల్పా వ్యాలీ సారా ప్రైడ్ అపార్ట్మెంట్లో ఈ నెల 2న రాత్రి టెర్రస్ నుంచి తాడు సహాయంతో బాల్కనీలోకి ప్రవేశించి 35 తులాల బంగారం, 2 కిలోల వెండి ఆభరణాలను దొంగిలించాడు. కేసు దర్యాప్తులో భాగంగా నవంబర్ 8న గచ్చిబౌలి ఎక్స్‌రోడ్స్ వద్ద నిందితుడు లిమ్మక అనంత్ కుమార్ (28)ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి చోరీ సొత్తుతో పాటు స్కూటర్, మొబైల్ ఫోన్, రెండు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో క్రైమ్ టీమ్ కేసును ఛేదించింది. నిందితుడిని రిమాండ్‌కు తరలించగా, తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
