రిపోర్టర్, కామారెడ్డి | 9989390343
Latest posts by Kethavath Permal
(see all) 
బాన్సువాడ: దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు, ఆనందాలు నింపాలని బాన్సువాడ నియోజకవర్గ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాసరావు ఆకాంక్షించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజలందరూ కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి ఆనందోత్సాహాల మధ్య దీపావళి పండుగను జరుపుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో అభివృద్ధి, ఆనందం, శాంతి సౌభాగ్యాలు కలగాలని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకోవాలని ఆయన సూచించారు. పర్యావరణానికి హాని కలగకుండా చిన్నారులు, పెద్దలు సురక్షితంగా పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.