నిరుపేద విద్యార్థిని వైద్య విద్యకు.. గోలి శ్రీనివాస్ రెడ్డి హామీ
- వెల్దండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదు - October 2, 2026
- మృతురాలి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక భరోసా.. విషాదంలో ఊతకర్రలా..ఉప్పల - October 2, 2026
- పేదల సొంతింటి కలను సహకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం - October 2, 2026
కల్వకుర్తి: కల్వకుర్తి తర్నికల్ గ్రామానికి చెందిన వాటం శ్రీశైలం కుమార్తె సౌమ్యకు సిద్దిపేట జిల్లాలో ఎంబీబీఎస్ సీటు లభించిన సందర్భంగా ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు.సౌమ్య ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసేందుకు ఐదు సంవత్సరాల పాటు స్టడీ మెటీరియల్తో పాటు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ వట్టేపు బాలయ్య,మాజీ కో-ఆప్షన్ సభ్యుడు రుక్ముద్దీన్, వార్డు మెంబర్ బచ్చలకూర మాణిక్యారావు, బీఆర్ఎస్ నాయకులు తాళ్ల సురేష్ గౌడ్, వర్కలా దేవయ్య, వాటం శ్రీశైలం,వాటం రవి తదితరులు పాల్గొన్నారు.
