మోమిన్ పేట్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వ సభ్య సమావేశం

ప్రజా పాలన ప్రభుత్వంలో రైతులందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సహకార సంఘాల బలోపేతానికి రైతుల కృషి చేయాలని మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వై మహేందర్ రెడ్డి పేర్కొన్నారు, బుధవారం మోమిన్ పేట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం పిఎసిఎస్ చైర్మన్ ఎన్  నరోత్తం రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ రైతులకు సకాలంలో పంట రుణాలు దీర్ఘ కాలిక రుణాలు, రైతులకు ఎరువులు విత్తనాలు సకాలంలో  రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రుణపడి ఉండాలని ఆయన సూచించారు , పిఎసిఎస్ చైర్మన్ నరోత్తం రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘం ద్వారా 15 కోట్ల 97 లక్షల స్వల్ప కాలిక రుణాలు 20 కోట్ల కు పైగా దీర్ఘకాలిక రుణాలు అందించి సహకార సంఘం లాభాల బాటలో పయనిస్తుందని ఆయన అన్నారు, జిల్లాలోని ఆదర్శ సహకార సంఘం గా తీర్చిదిద్దే విధంగా పాలకమండలి సభ్యుల సహకారంతో రైతుల సహకారంతో ముందుకు తీసుకెళ్తానని ఆయన అన్నారు, ఎఫ్ఈఓ జిల్లా ఇంచార్జ్ స్రవంతి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ పట్లోళ్ల మల్లారెడ్డి, సీఈఓ శేఖర్ సిబ్బంది, బాలయ్య రవికుమార్ నరసింహులు గౌడ్ పాలక మండల సభ్యులు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు

You may also like...