మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ 6వ వర్ధంతి సందర్భంగా అన్నదానం

1001219504.jpg

వెల్దండ మండల పరిధిలోని మహాత్మాగాంధీ కాలనీ తండా మాజీ సర్పంచ్ స్వర్గీయ ముడావత్ లక్ష్మణ్ నాయక్ 6వ వర్ధంతిని కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమంతో నిర్వహించారు. ఈ సందర్భంగా నిలోఫర్ ఆసుపత్రి సమీపంలో సుమారు 300 మంది పేదలు, అవసరంలో ఉన్న వారికి టిఫిన్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. లక్ష్మణ్ నాయక్ సేవాభావాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన చూపిన సేవా మార్గంలో నడవడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

You may also like...