తండ్రి మరణంతో కోల్పోయిన పెద్ద దిక్కు.. రూ. 57 వేలితో అండగా నిలిచిన గ్రామస్తులు
- తండ్రి మరణంతో కోల్పోయిన పెద్ద దిక్కు.. రూ. 57 వేలితో అండగా నిలిచిన గ్రామస్తులు - September 28, 2026
- కృష్ణ జింకల అక్రమ వేట – తొమ్మిది మంది అరెస్టు.! - September 28, 2026
- నాగర్ కర్నూల్ లో ప్రజావాణికి 51 ఫిర్యాదులు - September 28, 2026

వెల్దండ:కొట్ర గ్రామంలో ఇటీవల అకాల మరణం చెందిన కొప్పు మాధవులు కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు. మాధవులకు ఇద్దరు చిన్నపిల్లలు ఉండటంతో వారి భవిష్యత్తు కోసం గ్రామస్తులందరూ కలిసి రూ.57 వేల నగదును సమకూర్చారు. ఈ మొత్తాన్ని ఆయన భార్య చైతన్య పేరుతో పోస్టాఫీసులో స్థిర నిక్షేపం చేశారు.ఈ సందర్భంగా మాధవులు కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన గ్రామస్తులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బి. మహేష్,9వ వార్డు సభ్యుడు కొప్పు మల్లేష్, ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు కొప్పు మల్లేష్, శివ, శ్రీకాంత్, చంటి తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.
