తొగరుపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో నమూనా పార్లమెంట్

జ్ఞాన తెలంగాణ, కొండాపూర్: తొగరుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో నమూనా పార్లమెంట్ సమావేశాన్ని నిర్వహించారు. స్పీకర్‌గా యూసుఫ్ బాబా వ్యవహరించగా, ప్రధానమంత్రిగా నైనిక, వివిధ శాఖల మంత్రులుగా మీనాక్షి, మౌనిక, రిషిత, సురేష్, గుండప్ప, క్రీస్తు రాజు పాల్గొన్నారు. ప్రతిపక్షంగా కృష్ణవేణి, శివాని, మధు, సఫేనా, విష్ణుసాయి, రేవంత్, నవాజ్, ఐషు తదితరులు చురుకుగా పాల్గొన్నారు.

పార్లమెంట్‌ నిర్వహణ, ప్రభుత్వ పాలన, ప్రజాస్వామ్య విధానాలపై విద్యార్థులకు కార్యక్రమం ద్వారా మంచి అవగాహన కలిగింది. పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు శ్రీనివాస్, ప్రసాద్‌లను ప్రధానోపాధ్యాయులు డాక్టర్ సి. దశరథ్ అభినందించారు. ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు నీలవేణి పాల్గొన్నారు1410250.jpg

You may also like...