ఆకట్టుకుంటున్న పురుషోత్తం రెడ్డి గ్రామీణ మహిళ వేషధారణ పెయింటింగ్
- తండ్రి మరణంతో కోల్పోయిన పెద్ద దిక్కు.. రూ. 57 వేలితో అండగా నిలిచిన గ్రామస్తులు - September 28, 2026
- కృష్ణ జింకల అక్రమ వేట – తొమ్మిది మంది అరెస్టు.! - September 28, 2026
- నాగర్ కర్నూల్ లో ప్రజావాణికి 51 ఫిర్యాదులు - September 28, 2026

వెల్దండ,సెప్టెంబర్ 28: ఆంధ్రజ్యోతి రిపోర్టర్ యెన్నం పురుషోత్తం రెడ్డి తన కలంతోనే కాకుండా కుంచెతోనూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఆయన వేసిన ఈ ఆయిల్ పెయింటింగ్ లో గ్రామీణ మహిళ సాంప్రదాయ వేషధారణలో, నీలం రంగు చీర, పసుపు రంగు ఓణీతో ఎంతో సహజంగా కనిపిస్తుంది. ముఖంలో భావం, చేతులకు తెల్ల గాజులు,మెడలో ముత్యాల హారం చిత్రానికి మరింత అందాన్ని తెచ్చాయి.వృత్తిలో జర్నలిస్టుగా ఉంటూనే, ప్రవృత్తిగా చిత్ర లేఖనంలోనూ తనకున్న ఆసక్తిని ఇలా చిత్రాల రూపంలో ఆవిష్కరిస్తున్నారని స్థానిక కళాభిమానులు ప్రశంసిస్తున్నారు.
