రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) శ్రీ తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి గారి ప్రోత్సాహం మరియు సహకారంతో యువ పర్వతారోహకుడు విస్లావత్ బన్నీ, ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ బృందం హిమాచల్ ప్రదేశ్‌లోని మియార్ లోయలో 6,027 మీటర్ల ఎత్తైన మౌంట్ తరంగ్-2 శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి అరుదైన ఘనతను సాధించారు. ఇప్పటికే పలు పర్వత శిఖరాలను అధిరోహించిన విస్లావత్ బన్నీ, ఈ ప్రతిష్టాత్మక యాత్రలోనూ తన సాహస ప్రతిభను చాటుకున్నారు. యువతలోని ప్రతిభను గుర్తించి, వారి కలలను సాకారం చేసుకునే క్రమంలో అవసరమైన ప్రోత్సాహం మరియు సహకారం అందించాలనే ఉద్దేశంతో సుభాష్ రెడ్డి గారు ఈ యాత్రకు అండగా నిలిచారు. యువతలోని ప్రతిభను గుర్తించి, వారికి అండగా నిలవాలనే సుభాష్ రెడ్డి గారి ప్రోత్సాహానికి ఈ విజయం ఒక చక్కటి నిదర్శనం.
ఈ ఘనత సాధించిన విస్లావత్ బన్నీకి, ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ బృందానికి హృదయపూర్వక అభినందనలు. యువ ప్రతిభకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న శ్రీ తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి గారికి అభిమానుల తరఫున అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు.
