రిపోర్టర్, రంగారెడ్డి | 919963721717
Latest posts by Sudhakar B
(see all) ఘనంగా లిటిల్ స్టార్ స్కూల్ ఉపాధ్యాయులు ఆనంద్ జన్మదిన వేడుకలు
ప్రముఖ విద్యావంతుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు
పత్రికా ప్రకటన / వార్తా నివేదిక:
లిటిల్ స్టార్ స్కూల్ ఉపాధ్యాయులు ఆనంద్ జన్మదిన వేడుకలు వివిధ ర రంగాల ప్రముఖులు, విద్యావంతులు మరియు స్నేహితుల సమక్షంలో అత్యంత వేడుకగా, ఘనంగా జరిగాయి.
ఈ వేడుకల్లో లిటిల్ స్టార్ ప్రధాన ఉపాధ్యాయులు సంజు, వాసవి ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డి. రామచందర్, చైతన్య జూనియర్ కళాశాల తెలుగు భాషా అధ్యాపకులు బి. శీను, ప్రముఖ ఆధునిక వచన కవి వాసవి కళాశాల సీనియర్ అధ్యాపకులు బి. సుధాకర్, ఉపాధ్యాయ మిత్రులు పాల్గొని ఆనంద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు పోలీస్ శాఖలో సేవలు అందిస్తున్న పి. చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనంద్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ఆనంద్ సమాజానికి, విద్యా రంగానికి అందిస్తున్న సేవలను కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సంతోషంగా జీవించాలని, విద్యాబోధనలో మరెన్నో విజయాలు సాధించాలని వేడుకలో పాల్గొన్న ప్రముఖులు మరియు స్నేహితులు ఆకాంక్షించారు.
